హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ప్యూర్ ఈవీ సంగారెడ్డిలోని తన ప్రస్తుత ప్లాంటు సమీపంలోనే మరో ప్లాంటును నిర్మిస్తామని ప్రకటించింది. దాదాపు రూ.400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో 40 ఎకరాల్లో దీనిని నిర్మిస్తామని సంస్థ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగరి వెల్లడించారు. ఇక్కడ ఏటా 15 వేల యూనిట్లు తయారు చేయవచ్చని, రెండేళ్లలోపు నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.
డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను 2027 నాటికి భారతదేశం అంతటా 320కి పైగా ఔట్‌లెట్లకు విస్తరిస్తామన్నారు. కంపెనీ తన వాహన బ్యాటరీ పవర్‌ట్రైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి 2025లో ప్యూర్‌పవర్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్యూర్ఈవీకి ప్రస్తుతం 70 డీలర్‌షిప్‌లు ఉండగా, వీటిలో తెలంగాణలో ఏడు ఉన్నాయి.