మెదక్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం పట్ల జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. సబంధిత అందరు అధికారుల సమన్వయం, సమష్టి కృషితో మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఎన్నికలు విజయవంతం అయ్యాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుండి మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాలు భాగస్వామ్యం మరువలేనివని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం సంతోషమన్నారు. పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 ఎన్నికల క గంటల వరకే అయినప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తు ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని, అందువల్ల గత పార్లమెంటు ఎన్నికల కంటే దాదాపు 4 శాతం అధికంగా పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులను, అనధికారులను, జిల్లా ప్రజలను, పాత్రికేయులను ఆయన అభినందించారు.