- 18.28 లక్షల ఓటర్లు..2,124 పోలింగ్ కేంద్రాలు
- ఒక్కో పోలింగ్ బూత్ లో 3 ఈవీఎంలు
మెదక్, వెలుగు : మే13న జరిగే పార్లమెంట్‌ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కంప్లీట్చేసింది. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేయగా, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఈవీఎంలు సమకూర్చారు. లోక్‌సభ రిటర్నింగ్ఆఫీసర్, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ఆధ్వర్యంలో, ఎలక్షన్అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఈవీఎంల చెకింగ్, ర్యాండమేజేషన్, కమిషనింగ్ ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ఆఫీసర్లు, స్టాఫ్‌కు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18,28,209 మంది ఓటర్లు ఉండగా వీరందరూ ఓటుహక్కు వినియోగించుకోవడానికి
వీలుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,124 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్ల సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉండడంతో అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 411 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ కోసం 2,759 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 2,336 మంది పీవోలు, 2,336 ఏపీవోలు, 4,672 మంది ఓపీవోలు, 166 మంది మైక్రో అబ్జర్వర్లు, 214 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.
7,961 బ్యాలెట్‌యూనిట్లు
మెదక్ లోక్‌సభ స్థానంలో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో అడిషనల్ఈవీఎంలు సమకూర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఆ తర్వాత అత్యధికంగా 44 మంది అభ్యర్థులతో మెదక్లోక్సభ నియోజకవర్గం రెండో స్థానంలో ఉంది. అనూహ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఒక్కో పోలింగ్ బూత్ లో 3 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో ఈవీఎంలో 15 గుర్తులతో పాటు, ఒక నోటా గుర్తు ఉంటుంది.
ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్‌యూనిట్లు, ఒక కంట్రోల్‌యూనిట్, ఒక వీవీ ప్యాట్అవసరమవుతాయి. టెక్నికల్ సమస్య తలెత్తి ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్‌యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ మొరాయించినా, పనిచేయకున్నా 25 శాతం బ్యాలెట్ యూనిట్లు, 25 శాతం కంట్రోల్యూనిట్లు, 40 శాతం వీవీ ప్యాట్లు అడిషనల్‌గా తెప్పించారు. ఈ లెక్కన మొత్తం లోక్ సభ నియోజకవర్గానికి 7,961 బ్యాలెట్ యూనిట్లు, 2,652 కంట్రోల్యూనిట్లు, 2,970 వీవీ ప్యాట్లు వచ్చాయి.