కరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి

కౌడిపల్లి, వెలుగు:కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని వృద్ధ దంపతులపై చేయి చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో శనివారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం..  కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన పి. బాలకృష్ణారావు, లక్ష్మీ బాయ్ దంపతులు కొన్నేళ్లుగా కౌడిపల్లిలోని ప్రతాప్​రెడ్డి  ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి ఇంటి యజమాని  కరెంట్ ఎక్కువగా కాలుస్తున్నారని, బిల్లు ఎక్కువగా వస్తోందంటూ వృద్ధుడైన బాలకృష్ణ రావు పై చేయి చేసుకున్నాడని అతడి భార్య లక్ష్మీబాయ్ తెలిపారు. అంతేగాక తమను బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి బయట పడేస్తానంటూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు.