భక్తులతో కిటకిటలాడిన .. ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం

పాపన్నపేట,వెలుగు: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో దర్శనానికి గంటల సమయం పట్టింది. 

భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చైర్మన్​బాలాగౌడ్​, అధికారులు ఏర్పాట్లు చేశారు.