మోడల్ స్కూల్‌ భోజనంలో బల్లి : నలుగురిపై విద్యాశాఖ వేటు

మెదక్ జిల్లా : కోమటిపల్లి మోడల్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. స్కూల్లో భోజన సిబ్బందిని విద్యాశాఖ అధికారులు తొలగించారు. కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో ఉదయం అల్పాహారంలో బల్లి పడింది. అది చూసిన ఓ విద్యార్థి తోటివారిని అప్రమత్తం చేశాడు. అప్పటికే 17 మంది టిఫిన్ చేశారు. వారికి వాంతులు, విరోచనాలు కావడంతో దగ్గరలోని రామాయంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. డాక్టర్లు విద్యార్థులను పరీక్షించారు. మిగతా 70 మంది విద్యార్థులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఇద్దరు విద్యార్థులకు కడుపునొప్పి రావటంతో అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. పాఠశాలలోని వంట మనిషి, సహాయకులు నలుగురిని విధుల నుంచి తొలగించారు. మోడల్ స్కూల్ కేర్ టేకర్ తోపాటు మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్స్ స్పెషల్ ఆఫీసర్లకు విద్యాశాఖ అధికారులు  షోకాస్ నోటీస్ జారీ చేశారు.

ALSO READ | తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో 20 విద్యార్థినులకు అస్వస్థత