కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు .. ఎంపీ రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు

మెదక్​: మాజీ సీఎం కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చిందని, ఆయనపై ఈడీ కేసు నమోదైందని  మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ మెదక్ లో జరిగిన విజయోత్సవ ర్యాలీ, సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొద్ది సేపటి క్రితమే తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందని అన్నారు. హరీశ్ రావు, వెంకట్రాంరెడ్డికి కూడా ముందుంది ముసళ్ల పండుగ అంటూ కామెంట్ చేశారు.  పైసలు, మందు ఓపెన్ గా పంచినోళ్లు ఓడిపోయారని అన్నారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని రఘునందన్ రావు అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరీశ్​ఎగిరిండని, ఇప్పుడు ఎక్కడికి పోయిండని ప్రశ్నించారు.  

తన గెలుపు కోసం చాలా మంది కష్టపడ్డారన్నారు.  ప్రజల గొంతుకగా పార్లమెంట్ లో కొట్లాడుతానని చెప్పారు.  రబ్బరు చెప్పులతో తిరిగి బీజేపీ శ్రేణులు  కష్టపడ్డారన్నారు.  పార్లమెంట్ లో గొప్ప నేతల పక్కన కూర్చునే అవకాశం కల్పించారన్నారు.   మెదక్​లో ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ప్రజల ఆశీర్వాదంతో మారుమూల  బొప్పాపూర్ గ్రామం  నుంచి ఢిల్లీకి పోయానని అన్నారు. 

రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యుద్ధం మొదలు పెట్టగా గెలిచేవరకు ఒదిలిపెట్టొద్దని హితవు పలికారు. జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచామన్నారు.  ఆత్మవిశ్వాసం ఉంటే ఈజీగా గెలువొచ్చన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పనిచేయాలని సూచించారు.  చాయి అమ్మిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారరన్నారు. మోడీ 200 సభలు పెట్టిండని, లీడర్ కావాలంటే పట్టుదల కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తా నని ఆయన