ఎల్బీనగర్​ లో కేటీఆర్​ పర్యటనతో భారీగా ట్రాఫిక్​ జామ్​ 

హైదరాబాద్​ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయన వెళ్లే మార్గంలో బీజేపీకి చెందిన చిన్నపాటి వాల్ పోస్టర్లు కూడా లేకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 

మరోవైపు.. కేటీఆర్ పర్యటనతో ఎల్బీనగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరగంట ముందు నుంచే ట్రాఫిక్ ను పోలీసులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.