కుటుంబ కలహాలతో మరదలిపై వదిన దాడి

ముథోల్, వెలుగు : కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ బురఖాలో వచ్చిన తన మరదలిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన నిర్మల్‌‌‌‌ జిల్లా ముథోల్‌‌‌‌లో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముథోల్‌‌‌‌ ఎస్‌‌‌‌బీఐలో పనిచేసే హనుమంతరావు తన భార్య అశ్విని, చెల్లి తనూజతో కలిసి సాయి మాధవ్‌‌‌‌నగర్‌‌‌‌లో ఉంటున్నాడు.

అశ్విని డెలివరీ కోసం కొన్ని నెలల కింద చింతలబోరిలోని పుట్టింటికి వెళ్లింది. బుధవారం హనుమంతరావు బ్యాంక్‌‌‌‌కు వెళ్లడంతో తనూజ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ టైంలో ఓ మహిళ బురఖాలో వచ్చి తనూజపై కత్తితో దాడి చేయడంతో ఆమె గొంతు, చేతులపై గాయాలు అయ్యాయి. తనూజ అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి బురఖాలో ఉన్న మహిళను పట్టుకున్నారు. బురఖా తొలగించి చూడగా అశ్వినిగా తేలింది. దీంతో ఆమెను పోలీసులకు అప్పగించారు.

తీవ్రంగా గాయపడ్డ తనూజను భైంసా ఏరియా హాస్పిటల్‌‌‌‌కు, అక్కడి నుంచి ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, తనూజ ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉందని, ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలం సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ మల్లేశ్‌‌‌‌ తెలిపారు.