కబ్జాలతోనే నిర్మల్​కు జలగండం

  • మళ్ళీ మునుగుతున్న జీఎన్​ఆర్​ కాలనీ 42 కుటుంబాల తరలింపు...

 
నిర్మల్, వెలుగు:
పట్టణంలోని గొలుసు కట్టు చెరువులు, కంద కాల ఆక్రమణలతో ఏటా వర్షాకాలంలో ముంపు ముప్పు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే రో డ్లన్నీ జలమయం అవుతూ పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జీఎన్ఆర్ కాలనీ వాసులకు తిప్పలు తప్పడం లేదు. మూ డు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జీఎన్ఆర్ కాలనీ నీట మునుగుతోంది.

దీంతో అధికారులు ఆ కాలనీలోని 42 కుటుంబాలను స్థానిక ఆల్ఫోర్స్ స్కూల్ కు త రలించారు. దీంతోపాటు పట్టణంలోని డాక్టర్స్ లేన్ రోడ్డు ప్రతి వర్షా కాలంలో చెరువును తలపిస్తోంది. మంచిర్యాల చౌరస్తా, శాంతినగర్ చౌరస్తా, శాస్త్రి నగర్, వైఎస్ఆర్ కాలనీ, విశ్వనాథ్ పెట్, సిద్దాపూర్, మంజులాపూర్, రాంనగర్, చిక్కడపల్లి తదితర వార్డులన్నీ వరదపోటకు గురవుతున్నాయి. 

ఆక్రమణలతోనే అవస్థలు....

 పట్టణంలోని చెరువులతోపాటు కందకాలు, నాలాలన్నీ ఆక్రమణకు గురికావడంతో వాననీరు  కాలనీలలోకి ప్రవహిస్తోంది. అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్ప ఆక్రమణలు తొలగించి, శాశ్వత పనులు చేపట్ట డం లేదు. స్వర్ణ ప్రాజెక్టు కు వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడల్లా ప్రాజెక్టు గేట్లు ఎత్తి వాగులోకి నీరు వదలగానే ఆ నీరు సగభాగం జీఎన్ఆర్ కాలనీలోకి ప్రవహిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం ఈ కాలనీ దాదాపుగా మునిగిపోయింది.

ఇటీవలే స్వర్ణ వాగులోని ఓ చెక్ డ్యాం ను తొలగించేందుకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ చెక్ డ్యాము ను తొలగించినట్లయితే వరద ఉధృతి ప్రభావం చాలా వరకు తగ్గి కాలనీకి ముప్పు తప్పుతుంది. జీఎన్ఆర్ కాలనీ ని క లెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ సం ద ర్శించారు.

 జీఎన్ఆర్ కాలనీ ఏ లీడరూ పట్టించుకోవడం లేదని కాలనీకి చెందిన మిట్టపల్లి హరీశ్​ నిరసనకు దిగాడు. ఇందులో భాగంగా ఇంటి భవనం పై నుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదేండ్ల నుంచి తమ కాలనీ ముంపుకు గురవుతూనే ఉందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.