ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

అల్లాదుర్గం, వెలుగు: లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న అల్లాదుర్గంలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను మెదక్ డీఎస్పీ రాజేశ్ గురువారం పరిశీలించారు. స్థానిక ఐబీ చౌరస్తాలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను గుర్తించారు. దేశ ప్రధాని పాల్గొనే సభలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.