భారత​మాత ఆఫీస్​లో మందు పార్టీ

బెల్లంపల్లిరూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేంద్రంలోని భారత​మాత మండల సమాఖ్య(ఐకేపీ) ఆఫీస్ బార్​గా మారింది. మందు బాటిళ్లు, స్టఫ్ తెచ్చుకొని​ఐకేపీ ఏపీఎం ప్రకాశ్​తో కలిసి కొందరు వీవోఏలు శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఇది స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలియడంతో వెంటనే వెళ్లి నిలదీశారు.

తాండూర్​ సీఐ కుమారస్వామి, ఎస్సై విజయ్​కుమార్​కు సమాచారం అందజేశారు. తాము వచ్చే సరికి మందు సీసాలను కిటికీల నుంచి బయటకు విసిరేశారన్నారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా, కాంగ్రెస్​ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.