జీడిమెట్ల, వెలుగు : దళితబంధు లబ్ధిదారు వాహనాలను అద్దెకు తీసుకుని అమ్ముకున్న డ్రైవర్ అరెస్ట్ అయ్యాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్, కాళ్లకల్ కు చెందిన కనిగిరి శ్యామ్(33) దూలపల్లిలో ఉంటూ డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన అత్తగారి ఊరైన లాల్సాబ్గూడానికి చెందిన పసులోల్ల భిక్షపతి, మద్దెల యాదగిరి, దాసరి పోచమ్మ, బొడ్డు రమేష్‌లకు దళిత బంధు కింద గూడ్స్ వాహనాలు రాగా.. వాటిని నెలకు రూ.13వేల చొప్పున శ్యామ్ కు లీజుకు ఇచ్చారు.
6 నెలలు అద్దె సక్రమంగా ఇచ్చిన శ్యామ్ఆ తర్వాత ఇవ్వడంలేదు. అనుమానంతో ఆరా తీయగా వాహనాలను అమ్ముకున్నట్టు తేలింది. భిక్షపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నాలుగు వాహనాలను రూ.10.50లక్షలకు అమ్ముకున్నట్టు ఒప్పుకున్నాడు. సూరారం పోలీసులు వాహనాలను రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు.