మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ క్యాన్సర్​ మందు

న్యూఢిల్లీ: మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా (ఒక రకమైన క్యాన్సర్‌‌‌‌‌‌‌‌) చికిత్స కోసం టోరిపాలిమాబ్ అనే మందును విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గురువారం తెలిపింది.  నాసోఫారింజియల్ కార్సినోమా (ఎన్​పీసీ) అనేది గొంతు పైభాగంలో వస్తుంది. తల, గొంతుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.   కంపెనీ కొత్త బయోలాజికల్ ఎంటిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఈ) టోరిపాలిమాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. 

 యూఎస్​ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ , మెడిసిన్స్ అండ్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఈ డ్రగ్​ను ఆమోదించాయని ప్రకటించింది. మనదేశంలో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ డ్రగ్​ను మార్కెట్ చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.