వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి 

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​వో డాక్టర్ హరీశ్​ రాజ్ ఆదేశించారు. డీఎంహెచ్​వో ఆఫీసులో 24 గంటల పాటు సమాచారాన్ని చేరవేయడానికి ర్యాపిడ్​ రెస్పాన్స్​ కంట్రోల్​ రూమ్​ను​ సెల్ ఏర్పాటు చేశామన్నారు.

రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో 15 రోజుల్లో డెలివరీకి సిద్ధంగా గర్భిణులను 102 అంబులెన్స్​లలో ఎంసీహెచ్​కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవల కోసం 9177084068 నంబర్​కు కాల్​ చేయాలని సూచించారు.