- రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్..
- 80 కోట్ల స్పామ్ మెసేజ్‌లను అడ్డుకున్నామన్న ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీతో రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల స్పామ్ మెసేజ్‌లను అడ్డుకున్నామని టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఏఐ టెక్నాలజీతో రోజుకి 10 లక్షల స్పామర్లను గుర్తించామని తెలిపింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌పై జరుగుతున్న మొత్తం కాల్స్‌లో ఆరు శాతం, మొత్తం మెసేజ్‌లలో రెండు శాతం స్పామ్ ఉన్నాయని పేర్కొంది. ‘ గత రెండున్నర నెలలుగా 25.2 కోట్ల యునిక్ కస్టమర్లకు స్పామ్ కాల్స్ గురించి తెలియజేశాం. దీంతో వీరు స్పామ్ కాల్స్‌ను ఆన్సర్ చేయడం 12 శాతం తగ్గింది’ అని ఎయిర్‌టెల్ వివరించింది. ఎయిర్‌టెల్ రిపోర్ట్ ప్రకారం, స్పామర్లలో 35 శాతం మంది ల్యాండ్‌లైన్ టెలిఫోన్లను వాడుతున్నారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎక్కువ స్పామ్ కాల్స్‌ను అందుకుంటున్నారు.
ALSO READ : బ్లూచిప్ షేర్ల పతనంతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
స్పామ్ కాల్స్ ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కర్నాటకలో, స్పామ్ మెసేజ్‌లు గుజరాత్, కోల్‌కతా, ఉత్తరప్రదేశ్‌లలో పుడుతున్నాయి. ముంబై, చెన్నై, గుజరాత్‌లోని ప్రజలను స్పామ్ మెసేజ్‌లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ‘76 శాతం స్పామ్ కాల్స్ మగవారిని టార్గెట్ చేస్తున్నాయి. 48 శాతం స్పామ్ కాల్స్ 36–60 ఏళ్లలోపు ఉన్నవారికి వస్తున్నాయి. 26–25 ఏళ్లలోపు ఉన్నవారు 26 శాతం స్పామ్ కాల్స్‌ను అందుకున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు 8 శాతం స్పామ్ కాల్స్ వచ్చాయి’ అని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఉదయం 9 నుంచి స్పామ్ కాల్స్ పెరుగుతున్నాయని, మధ్యాహ్నం 3 అప్పుడు స్పామ్ కాల్స్ బెడద ఎక్కువగా ఉంటోందని వెల్లడించింది. స్పామ్ కాల్స్ సంఖ్య ఆదివారం 40 శాతం మేర తగ్గిందని, రూ.15 వేలు–20 వేల ఫోన్లు వాడుతున్నవారే ఎక్కువ స్పామ్ కాల్స్ అందుకుంటున్నారని వివరించింది.