లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : గాయత్రీ దేవి

కంది, వెలుగు : స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​వో గాయత్రీ దేవి హెచ్చరించారు.బుధవారం జిల్లా డీఎంహెచ్​వో ఆఫీస్ లో  లింగ నిర్ధారణ చట్టంపై అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించినారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో  మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లా లో 147 స్కానింగ్ సెంటర్స్ లైసెన్స్ తో నడుస్తున్నాయని, ఆరు సెంటర్లు రెన్యువల్ కోసం, కొత్తగా ఐదు సెంటర్లు లైసెన్స్​కోసంఅప్లికేషన్​చేసుకున్నట్లు తెలిపారు. 

ఎవరైనా లింగ నిర్ధారణ చేసినట్లు తేలితే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష,  రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. అనంతరం లింగనిర్ధారణకు సంబంధించిన పాంప్లేట్స్​ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వీఎన్​డీటీ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ సంగారెడ్డి, సుధారాణి, శశాంక్, మనోహర్ రెడ్డి, రాజు గౌడ్, వనజ రెడ్డి, పల్లవి, చందర్, ప్రసాద్, వీర్ కుమార్, రవి పాల్గొన్నారు.