20 మందికి డెంగ్యూ లక్షణాలు

  • డీఎంహెచ్​వో గాయత్రి

జోగిపేట, వెలుగు: జోగిపేట ఏరియా ఆస్పత్రిని శుక్రవారం డీఎంహెచ్​వో గాయత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులు పరిశీలించి 20 మంది కి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో ముగ్గురు  డెంగ్యూ చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.

అనంతరం హాస్పిటల్​లో అన్ని వార్డులు తిరిగి పేషెంట్ల రికార్డులు పరిశీలించారు. వారితో  మాట్లాడి వైద్యం అందుతున్న తీరు తెలుసుకున్నారు.