డీమార్ట్​ ఆదాయం రూ.15,565 కోట్లు

న్యూఢిల్లీ: డీమార్ట్​పేరుతో రిటైల్​స్టోర్లు నిర్వహించే ఎవెన్యూ సూపర్​మార్ట్​ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​లో స్టాండెలోన్​రెవెన్యూ 17.5 శాతం పెరిగి రూ.15,565 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది డిసెంబరు క్వార్టర్​లో రూ.13,247.33 కోట్లు వచ్చాయి. 

గత డిసెంబరు నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 387కు చేరింది. రాధాకిషన్​ దమానీ ప్రమోట్ ​చేస్తున్న డీమార్ట్​ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో స్టోర్లను నిర్వహిస్తోంది.