కడ్తాల్ గ్రామంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం

నిర్మల్, వెలుగు: సోన్ మండలం కడ్తాల్ గ్రామ  ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ అయ్యప్ప స్వాములకు శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి మతసామరస్యాన్ని చాటుకున్నారు.  మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే ననే భావనతో అన్నదానం చేసినట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  గురుస్వాములు  నర్సారెడ్డి ,  చిన్నయ్య, నర్సారెడ్డి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్​ తదితరులు పాల్గొన్నారు.