మెదక్ టౌన్, వెలుగు : పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జీ లక్ష్మీశారద మాట్లాడుతూ... ప్రస్తుతం కాలుష్యం వల్ల పర్యావరణ ఎంతో దెబ్బతింటోందని, దీంతో అనారోగ్యంపాలు కావాల్సి వస్తోందని చెప్పారు.
మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే మంచి గాలి, వాతావరణం ఉండటంతో భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు జితేందర్, రీటాలాల్ చంద్, సీనియర్ లాయర్ కొప్పుల పోచయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
మనోహరాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి అన్నారు. బుధవారం మండలంలోని రంగాయిపల్లి గ్రామ శివారులో ని అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. ప్రకృతి ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రకృతిలో మార్పులు, విపత్తులకు కారణం మానవ తప్పిదమేనని అన్నారు. పర్యావరణాన్ని విపత్తుల నుంచి రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ ఎండీ ప్రమోద్ అగర్వాల్,సీఐ కృష్ణ ,ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఫ్లాష్ మాబ్
సిద్దిపేట టౌన్, వెలుగు:సిద్దిపేట జిల్లా కేంద్రం లో క్రాంతి పాఠశాల , నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. కూడలిలో విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ.. పర్యావరణంపై అవగాహన కల్పించారు. క్రాంతి పాఠశాల డైరెక్టర్ భగవాన్ రెడ్డి, నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ , క్వాలిటీ కోఆర్డినేటర్ బేతి భాస్కర్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను వినియోగాన్ని తగ్గించి, చెట్లను పెంచాలని చెప్పారు. ప్రతి ఒక్కరు మొక్కలను సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అర్పిత, పాఠశాల ప్రిన్సిపల్ కుమారస్వామి,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.