ఓటరు సర్వే పక్కాగా చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

  • కలెక్టర్ కుమార్ దీపక్ 

బెల్లంపల్లి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా తయారీ ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న ఇంటింటా సర్వే ను శనివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఓటరు జాబితా తయారీని పరిశీలించాలని ఆదేశించారు. 

ఓటరు నమోదు, మార్పులు, సవరణలు, తొలగింపు కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2, 3 ఎపిక్ కార్డులు, చిరునామా మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలి, మరణించిన వారి వివరాలను తొలగించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.