- జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద
నర్సాపూర్, వెలుగు : పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద, నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత సూచించారు. శనివారం నర్సాపూర్ జూనియర్ కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సందర్శించగా జడ్జి అనిత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటే అలవాటు చేసుకుంటే అవి వృక్షాలుగా ఎదిగి ఆక్సిజన్ అందిస్తాయన్నారు.
చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవేందర్, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ సత్యనారాయణ, బార్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ పుష్పరాజ్, లీగల్ సర్వీస్ అడ్వకేట్ స్వరూప రాణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.