నులిపురుగుల మాత్రలు పంపిణీ

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లాలోని గవర్నమెంట్, ప్రవేట్ స్కూళ్లలో, కాలేజీలో చదువుతున్న 2.36 లక్షల మంది స్టూడెంట్స్​కు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేయడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తూప్రాన్ గవర్నమెంట్ స్కూల్ లో  స్టూడెంట్స్ కు ఆయన నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలంటే నులిపురుగుల మాత్రలను వేయించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో శ్రీరామ్, ఆర్డీవో జయం చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిషనర్ ఖాజా మొయినద్దీన్, తహసీల్దార్​విజయలక్ష్మి , పీఏసీఎస్​చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.

29 నుంచి సంక్షేమాధికారుల పరీక్షలు 

మెదక్​టౌన్ : ఈ నెల 24 నుంచి 29వరకు సంక్షేమ అధికారుల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ రాహుల్​ రాజ్​ తెలిపారు. గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో సంక్షేమ అధికారుల పోస్టుల కోసం నిర్వహించే గ్రేడ్- 2 పరీక్షలు ఈనెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు వారి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు గంట ముందు హాజరుకావాలన్నారు. ఉదయం 10 గంటలకు మొదటి సెషన్​ పరీక్ష, మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి రెండో సేషన్ పరీక్ష జరుగుతుందన్నారు.