ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో..రూ.16.15 లక్షల సీఎంఆర్ చెక్కుల పంపిణీ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ​ఫండ్​చెక్కులను శనివారం  కాంగ్రెస్ లీడర్లు అందజేశారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో మంచిర్యాల హైటెక్​ సిటీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మందమర్రి మండల, పట్టణ కాంగ్రెస్​లీడర్లు 47 మంది లబ్ధిదారులకు రూ.16.15 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. మందమర్రి టౌన్​ కాంగ్రెస్ ​ప్రెసిడెంట్ ​నోముల ఉపేందర్​ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ జనరల్​ సెక్రటరీ సొతుకు సుదర్శన్, మండల అధ్యక్షుడు నీలయ్య, మండల ఇన్​చార్జి కడారి జీవన్​కుమార్, ఎస్సీ సెల్​టౌన్​ ప్రెసిడెంట్​ నెరువెట్ల శ్రీనివాస్, లీడర్లు లక్ష్మణ్, హఫీజ్, రమేశ్, కిరణ్ పాల్గొన్నారు.