నస్పూర్, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ టాకీస్ ఏరియా దగ్గర పలు వార్డుల్లోని మహిళలకు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చీరలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.