అధిక ఫీజుల వసూళ్ల పై వినతి పత్రాలు అందజేత

సిదిపేట, వెలుగు: ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లపై ధర్మ స్టూడెంట్ యూనియన్, ఎఐఎస్ఎఫ్, బీఆర్ఎస్ స్టూడెంట్​సంఘాల నేతలు బుధవారం వేర్వేరుగా డీఈవోకు వినతి పత్రాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా వ్యాపారానికి తెరలేపాయని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నాయని ఆరోపించారు. 

 ఇలాంటి విద్యాసంస్థలపై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.