వెంకుర్ లో దమ్మ చక్ర దినోత్సవం

కుంటాల, వెలుగు: కుంటాల మండలంలోని వెంకుర్ లో ఆదివారం దమ్మ చక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచ శీల జెండాను ఎగురవేశారు. గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ ఫొటోలకు పూలమా లలు వేసి పూజలు చేశారు. జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్, స్థానిక దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.