భక్త జనసంద్రంగా మహా పాదయాత్ర

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా సిర్పూర్(టి) మండలం టోంకినిలోని సిద్దిహనుమాన్ ఆలయ 23వ మహా పాదయాత్రకు భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టణం నుంచి టోంకిని సిద్దిహనుమాన్‌‌‌‌ ఆలయం వరకు 26 కిలోమీటర్ల మేర భక్తులు పాదయాత్రగా వచ్చి మొక్కలు తీర్చుకున్నారు.

 ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే మహాపాదయాత్రకు తరలివచ్చిన భక్తులతోపాటు ప్రముఖులు, అధికారులు అంజన్నను దర్శించి పూజలు చేశారు. ఆలయ కమిటీతో పాటు సిర్పూర్‌‌‌‌(టి), కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, కౌటాల, తదితర ప్రాంతాల్లోని స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిర్పూర్ టీలో భక్తులకు పలువురు ముస్లింలు అరటిపండ్లు, మంచినీరు పంపిణీ చేసి మతసామరస్యంచాటారు.