కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయంత్రం నుంచే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నుంచి స్వామికి అభిషేకాలు, అర్చనలు చేశారు. పట్నాలు వేసి, ఒడిబియ్యం పోసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

మట్టి కుండల్లో భోనం తయారు చేసి కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి, మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. రాతి గీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టింది.

 కొమురవెల్లి, వెలుగు