పోస్టల్​ సేవింగ్స్​ ఖాతాలపై అవగాహన పెంచాలి : దేవిరెడ్డి సిద్ధార్థ

బెల్లంపల్లి, వెలుగు:  తపాలా శాఖ చేపట్టిన సేవింగ్స్​ ఖాతాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థ సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని సబ్ డివిజనల్ పోస్టల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్థిక సంవత్సరంలో పోస్టల్ పథకాల వినియోగంలో ప్రజలను చైతన్యపరిచి ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పోస్టల్ ఇన్ స్పెక్టర్ విక్రమ్, మంచిర్యాల బ్రాంచి మేనేజర్ వెంకటస్వామి,  బెల్లంపల్లి పోస్ట్ మాస్టర్  వెంకన్న,  బెల్లంపల్లి సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీస్ ఆజువాన్, మధుకర్, తాండూర్, భీమిని, దహేగాం, నెన్నెల, కాసిపేట, మందమర్రి మండలాల పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.