రక్షణ సూత్రాలను పాటించాలి

కోల్​బెల్ట్, వెలుగు: రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా మందమర్రి ఏరియా కాసిపేట-2గనిని రక్షణ బృందం బుధవారం సందర్శించింది. సింగరేణి సేఫ్టీ కమిటీ కన్వీనర్ బి.శ్రీనివాస్ రావు, జీఎం(ఐఅండ్​పీఎం) మందమర్రి ఏరియ జనరల్ మేనేజర్ జి.దేవేందర్, బెల్లంపల్లి రీజియన్​ జీఎం(సేఫ్టీ) కె.రఘుకుమార్ ఆధ్వర్యంలో గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగా జీఎంలు మాట్లాడుతూ.. రక్షణ సూత్రాలను ఉద్యోగులు నిత్యం పాటించాలన్నారు. అంతకు ముందు రక్షణ జెండాను ఆవిష్కరించారు. రక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ ఎం.రవీందర్, కేకే గ్రూప్​ఏజెంట్​రాందాస్, డీజీఎం శ్రీనివాస్, గని మేనేజర్ లక్ష్మీనారాయణ, సేఫ్టీ అధికారి రవిశంకర్, వెల్ఫేర్​ ఆఫీసర్​ భార్గవ్​ తదితరులు పాల్గొన్నారు.  

న్యాణమైన బొగ్గు ఉత్పత్తి చేయాలి

సింగరేణి స్థితిగతులను కార్మికులకు వివరించేందుకు ఏర్పాటు చేసిన మల్టీ డిపార్ట్​మెంట్​ కమిటీ బృందం కాసిపేట-1 గనిని సందర్శించింది. నాణ్యతో కూడిన బొగ్గును వినియోగదారులకు రవాణా చేయాలని, పొదుపు చర్యలు పాటిస్తూ సంస్థలను ముందుకు తీసుకెళ్లాలని కమిటీ చైర్మన్​, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​అన్నారు. ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. కమిటీ సభ్యులైన ఏరియా ఏస్వోటుజీఎం విజయ్​ప్రసాద్, డీజీఎంలు వెంకటరమణ, ప్రసాద్, రాజన్న, డీవైపీఎం ఆసిఫ్, గని మేనేజర్​భూశంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. 

రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

జైపూర్, వెలుగు: రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ అన్నారు. ఇందారం ఐకేఐఏ గనిపై జరిగిన 55 వార్షిక రక్షణ పక్షోత్సవాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కంపెనీ వ్యాప్తంగా ఉద్యోగుల రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఉద్యోగులందరూ సేఫ్టీ మేనేజ్​మెంట్ ప్లాన్స్​పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించి రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని సూచించారు. జీఎం (ఆర్ అండ్ డీ) నారాయణ రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, గని మేనేజర్ నాగన్న, ఉద్యోగులు పాల్గొన్నారు.