బీఆర్ఎస్ పాలనలో రూ.6,71,757 కోట్ల అప్పు.. జిల్లాల తలసరి ఆదాయం మధ్య తీవ్ర అంతరాయం

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.6,71,757 కోట్ల అప్పు చేసిందని వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్ర రుణం పది రెట్లు పెరిగిందన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు గడిచిన 6 నెలల్లో తమ ప్రభుత్వం రూ.42,892 కోట్లు వడ్డీలకే  చెల్లించిందన్నారు. బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. అనేక ప్రాజెక్టుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు.  

మరోవైపు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని జిల్లాల తలసరి ఆదాయం మధ్య తీవ్ర అంతరాయం ఉందని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2023-24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299 కాగా జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236గా ఉందన్నారు. జిల్లాల వారీగా భారీ అంతరాయం ఉందని.. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862గా ఉంటే.. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 1,80,241గా ఉందని భట్టి తెలిపారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని తెలిపారు.