తొగుట, వెలుగు : మల్లన్నసాగర్ రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు డీఈ శ్రీనివాస్ తెలిపారు. తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ లోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాట్లు చేసినట్టు డీఈ తెలిపారు.
ప్రతిరోజు 0.432 టీఎంసీలను రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తామని , ఈనెల11 వరకు కొనసాగుతుందన్నారు. వానాకాలం పంటలకు సాగునీటి కోసం ఈ నీటిని ఉపయోగించనున్నట్లు తెలిపారు.