సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యం : డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్

ఖానాపూర్, వెలుగు: సర్కారు దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నిర్మల్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

రికార్డులతో పాటు ఓపీ, ఐపీ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అలాగే ఆస్పత్రి ఆవరణలోని డయాలసిస్ సెంటర్ ను  పరిశీలించారు.రోగుల పట్ల డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. వైద్య రంగానికి  ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సర్కార్ దవాఖానాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ మాధవ్, సిబ్బంది పాల్గొన్నారు.