నమ్మండి.. ఇది రహదారేనండి..

ఆదిలాబాద్ పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే దస్నాపూర్–పిట్టలవాడ​ రహదారిలో అడుగడుగునా గుంతలు ఏర్పడి అద్వానంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలువడంతో కొన్ని చోట్ల రోడ్డు నీటి కుంటలా దర్శనమిస్తోంది.

ఈ మార్గం గుండా వెల్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రహదారిని బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.    

వెలుగు, ఆదిలాబాద్​ టౌన్