గిరిజన గూడాల్లో దండారి ఉత్సవాలు

నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండలంలోని లింగట్ల, గోండుగూడ గ్రామాల్లో దండారి ఉత్సవాలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఇండ్లు, వాకిలి అలికి అలంకరించి, గ్రామ పటేల్ ఇంటిముందు ఉండే పెద్ద జెండా చుట్టూ గుస్సాడి సామగ్రి ఉంచి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

దీపావళి పండుగను పురస్కరించుకొని దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని గ్రామ పటేల్ ఆశే రావు తెలిపారు. పూజారి మడావి ఆనందరావు, పెందూర్ భీంరావు, సిడం సంతోష్, గ్రామస్తులు పాల్గొన్నారు.