నేరడిగొండ, బెల్లంపల్లిలో జోరుగా దండారి ఉత్సవాలు

బెల్లంపల్లి రూరల్/బజార్ హత్నూర్/ నేరడిగొండ, వెలుగు: ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. కాసిపేట మండలంలోని దేవాపూర్​సల్ఫలవాగులో ఆదివాసీలు నిర్వహించిన దండారి దర్బార్​ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్​హాజరయ్యారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. వివిధ మండలాలకు చెందిన దండారీలు, ఆదివాసీలు, హాజరై వెంకట్రాది ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, ఓరియంట్ ​సిమెంట్ ​కంపెనీ యూనిట్​ హెడ్​ బాలగిరిధర్ తదితరులు పాల్గొన్నారు. 

బజార్ హత్నూర్ మండలంలోని చింతల సాంగ్వి, వివిధ ఆదివాసీ గ్రామాల్లో దండారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తమ ఆచారం ప్రకారం పటేల్ ఇంటి ముందు గుస్సాడి సామగ్రిని ఉంచి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గుస్సాడీ ఉత్సవాలను ప్రారంభించారు. నేరడిగొండ మండలంలోని మంగళ్​మోట గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్ ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 దండారీ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు పెంచేలా చూస్తానన్నారు. ఆదివాసీ గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బోథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఆడే వసంతరావు, నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, తొడసం శంకర్, సంబన్న, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.