చెన్నూర్, వెలుగు: చెన్నూర్ మండలం సోమన్ పల్లిలో తాము 20 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వాలని సోమన్ పల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు తోకల లక్ష్మణ్, లింగయ్య కోరారు.
ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమన్పల్లిలోని 306, 1267 సర్వే నెంబర్లలో 119 ఎకరాల భూమిని సుమారు 100 కుటుంబాలు 20 ఏండ్లుగా సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మరి కొందరు ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి సాగులో ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.