జగదేవపూర్, వెలుగు : ముగ్గురు పిల్లలున్న వారికి జీపీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని దళిత సంఘాల నాయకులు ఏసు, సుధాకర్, కుమార్, లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఇటిక్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు ఉన్న వారికి మాత్రమే జీపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని ప్రకటిస్తూ జీవో రావడం వల్ల ఎంతోమంది దళిత బహుజనులు పోటీకి దూరమవుతున్నట్లు తెలిపారు.
1995 సంవత్సరంలో వచ్చిన ఈ జీవోను రద్దుచేసి ముగ్గురు పిల్లలు ఉన్నవారిని పోటీకి అర్హులుగా ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో ధర్నాలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దివ్య, లాలయ్య, యాదగిరి, కనకయ్య, లక్ష్మి, రేణుక, భూమయ్య, నర్సింలు ఉన్నారు.