కవ్వాల్ టైగర్ జోన్‌‌‌‌లో సైక్లింగ్

జన్నారం, వెలుగు: వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా కవ్వాల్‌‌‌‌ టైగర్‌‌‌‌ జోన్‌‌‌‌లో ఆదివారం ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు సైక్లోథాన్‌‌‌‌ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్‌‌‌‌ డివిజన్‌‌‌‌లోని తాళ్లపేట రేంజ్‌‌‌‌ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమైన సైక్లింగ్‌‌‌‌ అలాద్రి నుంచి ఊట్ల వరకు టైగర్‌‌‌‌ జోన్‌‌‌‌లోని బఫర్‌‌‌‌ ఏరియాలో సుమారు 20 కిలోమీటర్లు కొనసాగింది. 

సైక్లింగ్‌‌‌‌కు కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్‌‌‌‌ జిల్లాలకు చెందిన 30 మంది సైక్లింగ్‌‌‌‌ క్లబ్‌‌‌‌ సభ్యులు హాజరయ్యారు. ఫారెస్ట్‌‌‌‌లో నిర్వహించిన సైక్లోథాన్‌‌‌‌లో పాల్గొనడం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించిందని సైక్లింగ్‌‌‌‌ క్లబ్‌‌‌‌ సభ్యులు చెప్పారు. వారి వెంట జన్నారం, ఇందన్‌‌‌‌పెల్లి రేంజ్‌‌‌‌ ఆఫీసర్లు సుస్మారావు, హఫీజొద్దీన్‌‌‌‌ ఉన్నారు.