మొబైల్​ హ్యాక్​ చేసి..బ్యాంకు ఎఫ్ డీ ఖాళీ చేసిన్రు

  • రూ.1.95 లక్షలు కొట్టేసిన సైబర్​ ఫ్రాడ్స్  

మంచిర్యాల, వెలుగు : కాంట్రాక్ట్​ఎంప్లాయ్ మొబైల్ ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలోని నగదును సైబర్​నేరగాళ్లు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాత మంచిర్యాలకు చెందిన ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కు స్థానిక యూనియన్​బ్యాంక్​లో సేవింగ్స్​అకౌంట్​ఉంది. అదే బ్యాంకులో ఫిక్స్​డ్​డిపాజిట్ కూడా చేశాడు. అతని మొబైల్ ను హ్యాక్ చేసిన సైబర్​ఫ్రాడ్స్  ఆదివారం బ్యాంక్​యాప్​ను రీసెట్​ చేస్తున్నామంటూ మెసేజ్..

ఆ తర్వాత పలుసార్లు ఓటీపీలు పంపించారు. అనుమానం వచ్చిన అతను వెంటనే బ్యాంక్​కస్టమర్​కేర్ కు కాల్​చేసి చెప్పాడు. అకౌంట్ ను బ్యాంకు అధికారులు పరిశీలించగా ఎఫ్ డీ అకౌంట్​క్లోజ్​చేసి అందులోని రూ.1.95 లక్షలను ఖాళీ చేసినట్టు తేలింది. నగదు పాట్నాలోని సెంట్రల్​బ్యాంక్​లోని

ఒక అకౌంట్ లో జమై అయినట్టు గుర్తించారు. దీంతో బాధితుడు సైబర్​క్రైమ్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు అకౌంట్​లో డబ్బులు ఉన్నాయా, డ్రా చేసుకున్నారా అనేది తెలియలేదు. పోలీసులు అకౌంట్​ను ఫ్రీజింగ్​చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు తెలిపాడు.