సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ హసీబుల్లా ఖాన్

  •   సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లాఖాన్

నేరడిగొండ, వెలుగు : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ  అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా ఖాన్ తెలిపారు.  నేరడిగొండ మండల కేంద్రంలోని  జడ్పీ హైస్కూల్ లోని విద్యార్థులకు  శుక్రవారం ఆయన సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అపరిచితులు పంపే మెసేజ్ లకు రిప్లయ్​ ఇవ్వద్దని, బ్యాంకు లావాదేవీలు, పిన్ , ఓటీపీ   వంటి ఏ నంబర్లను ఇతరులతో షేర్​ చేసుకోవద్దని తెలిపారు. 

  గేమ్ యాప్ లు , ఉద్యోగాల మోసం , సోషల్ మీడియా మోసాలు,  లాటరీలు, రైతు రుణాల మోసాలు వంటి ఆఫర్లను నమ్మొదని సూచించారు.    ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ కుటుంబీకులు

బంధువులు, తెలిసిన వారికి సైబర్ నేరాల పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, హెచ్ఎం పద్మ, టీచర్లు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు .