ఇయ్యాల మూడు మండలాలకు కరెంట్​ కట్ : ఏడీఈ ప్రభాకర్ రావు

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మండలం శాంతాపూర్ సబ్ స్టేషన్ నుంచి వచ్చే 33 కేవీ లైన్ రిపేర్ల నేపథ్యంలో ఈనెల 13న  లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల వినియోగదారులకు కరెంట్​కట్​ఉంటుందని ఏడీఈ ప్రభాకర్ రావు తెలిపారు.

 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.