డిస్ట్రిబ్యూటరీ కాలువలకు రిపేర్లు లేక కడెం సాగు నీరు రోడ్డుపాలవుతోంది. దండేపల్లి మండల కేంద్రంలోని 28వ డిస్ట్రిబ్యూటరీ ఆంధ్రకాలనీ రాష్ట్రీయ రహదారిపై సాగు నీరు పారుతూ చెరువును తలపిస్తోంది. కాలువలో చెత్తాచెదారం నిండి.. నీరు కిందిక ప్రవహించక రోడ్డుపై ఎక్కి పారుతోంది.
పొలాలకు అందాల్సిన సాగు నీరు వృథాగా పోతుండడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల అధికారులు స్పందించి కాలువలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు.
- వెలుగు, దండేపల్లి