కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం కోనేరులో స్నానాలు చేసి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. అనంతరం నైవేద్యం వండి డబ్బు చప్పుళ్ల మధ్య లతో బోనాలు సమర్పించారు. గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మల్లికార్జున స్వామికి,  బలిజ మేడలమ్మ దేవికి, గొల్ల కేతమ్మకు ఒడిబియ్యం పోసి నిత్య కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.