రైతులకు తెల్వకుండానే క్రాప్‌‌‌‌‌‌‌‌లోన్లు

  • మంచిర్యాల పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సీఈవో చేతివాటం
  • రుణమాఫీ మెసేజ్‌‌‌‌‌‌‌‌లతో బయటపడ్డ భాగోతం
  • కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసిన రైతులు, విచారణకు ఆదేశం
  • జిల్లావ్యాప్తంగా అన్ని సొసైటీల్లో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అనుమానాలు

మంచిర్యాల, వెలుగు: పంట పెట్టుబడుల కోసం రైతులకు క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్లు ఇచ్చి అండగా నిలవాల్సిన పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సీఈవోలు చేతివాటం చూపుతున్నారు. రైతులకు తెలియకుండానే వారి పేరున లోన్లు తీసుకొని రుణమాఫీ పేరుతో లబ్ధి పొందుతున్నారు. లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకోని రైతులకు రుణమాఫీ అయినట్లు ఇటీవల మెసేజ్‌‌‌‌‌‌‌‌ రావడంతో అక్రమార్కుల బాగోతం బయటపడుతోంది.

ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మెసేజ్‌‌‌‌‌‌‌‌లను చూసి ఆందోళనకు గురైన రైతులు గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌లో  కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేసి బాధ్యులపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

అసలు లోన్‌‌‌‌‌‌‌‌ మాఫీ కాలే...

కందుల లక్ష్మయ్య 2006లో మంచిర్యాల సహకార బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో లాంగ్‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ రూ.30 వేలు తీసుకొని తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత సహకార బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నుంచి తిరిగి ఎలాంటి లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకోలేదు. 2016లో ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌లో రూ.1.40 లక్షల క్రాప్‌‌‌‌‌‌‌‌లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. 2020 సంవత్సరం వరకు ఏటా వడ్డీ చెల్లించి రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. 2021 నుంచి ఆ లోన్‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది.

వాస్తవంగా లక్ష్మయ్యకు ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్న లోన్‌‌‌‌‌‌‌‌ మాఫీ కావాలి. కానీ మంచిర్యాల పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సీఈవో సత్యనారాయణ రుణమాఫీ కటాఫ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ అయిన 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9న లక్ష్మయ్య పేరుతో క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌ తీశాడు. ప్రభుత్వానికి పంపిన లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఈ లోన్‌‌‌‌‌‌‌‌ వివరాలను పంపించాడు. దీంతో లక్ష్మయ్య పేరున సీఈవో తీసుకున్న రూ.90,722 లోన్‌‌‌‌‌‌‌‌ మాఫీ అయింది. వాస్తవంగా ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌లో తీసుకున్న లోన్‌‌‌‌‌‌‌‌ మాత్రం
అలాగే ఉండిపోయింది. పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సీఈవో పెంట సత్యనారాయణ నిర్వాకం వల్ల తాను రుణమాఫీ కోల్పోయానని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

జిల్లా వ్యాప్తంగా అక్రమాలు

ఒక్క మంచిర్యాల పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల్లో సైతం ఇలాంటి అక్రమాలే జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్లు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించినప్పటికీ డబ్బులు జమ చేయకుండా లోన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టడం, రైతులకు తెలియకుండా వారి పేరునక్రాప లోన్లు తీసి సొంతానికి వాడుకోవడం వంటివి జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రుణమాఫీ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత ఎక్కువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సహకార బ్యాంక్ వ్యవహారాలన్నీ సీఈవోల చేతుల్లోనే ఉండడం వల్ల అక్రమాలు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రుణమాఫీ జాబితాపై విచారణ జరిపిస్తే ఇలాంటి అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

ఇద్దరు రైతుల పేరిట రూ.  2 లక్షలు మాఫీ

మంచిర్యాల పట్టణంలోని సంజీవయ్య కాలనీలో ఉన్న పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌లో హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన రైతులు సిరిపెల్లి బాపు, కందుల లక్ష్మయ్య గతంలో లోన్లు తీసుకొని తిరిగి చెల్లించేశారు. వీరి క్రాప్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవు. కానీ ఏడీసీసీబీ మంచిర్యాల బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో బాపుకు ఉన్న రూ.1,10,505, లక్ష్మయ్యకు ఉన్న రూ.90,722 లోన్‌‌‌‌‌‌‌‌ మాఫీ అయినట్లు ఇటీవల వారి సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లకు మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దీంతో అవాక్కయిన రైతులు పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సీఈవో పెంట సత్యనారాయణను సంప్రదించగా అవి ఫేక్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లని, అలాంటి వాటిని నమ్మొద్దంటూ చెప్పాడు.

అనుమానం వచ్చిన రైతులు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను సంప్రదించడంతో బాపు, లక్ష్మయ్యకు ఇద్దరికీ రుణమాఫీ అయినట్లు చెప్పారు. దీంతో మళ్లీ సీఈవో దగ్గరికి వెళ్లి నిలదీశారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని, ఎవరికీ ఫిర్యాదు చేయొద్దని, త్వరలోనే సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తానని కాళ్లావేళ్లా పడ్డట్లు తెలిసింది.