ఈ ఏడాది 18 ఓటీటీలపై బ్యాన్‌: కేంద్ర మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: అడల్ట్‌, అసభ్యకరమైన  కంటెంట్‌‌‌‌ను ప్రమోట్ చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ను ప్రభుత్వం ఈ ఏడాది బ్యాన్ చేసిందని  ఇన్‌‌‌‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌‌‌‌కాస్టింగ్ మినిస్టర్ ఎల్‌‌‌‌. మురుగన్ లోక్‌‌‌‌సభలో పేర్కొన్నారు. అసభ్యకరమైన కంటెంట్‌‌‌‌ ప్రసారం కాకుండా చూసేందుకు 2021 లో  రూల్స్ కఠినం చేశామని, డిజిటల్ మీడియా పబ్లిషర్లు, ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌ ఎలా నడుచుకోవాలో ఐటీ రూల్స్‌‌‌‌లో క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఉందని వెల్లడించారు. హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌‌‌‌ను ఇస్తున్నందుకు  ఈ ఏడాది మార్చి 14వ తేదీన 18 ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ను బ్యాన్ చేశామని ఆయన  వివరించారు.