సంక్షోభ కాలంలో సాహసోపేత బడ్జెట్: కూనం నేని

రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత బడ్జెట్ ప్రవేశ పెట్టిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.  రూ.2.91 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్​ను తమ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

రూ 6.70 లక్షల కోట్ల అప్పుల నేపథ్యంలో వ్యవసాయానికి 72 కోట్లు, రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాలను కాంగ్రెస్​పార్టీ చేపట్టడం సంతోషకరమైన విషయమన్నారు.