- 4 మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలు
సిద్దిపేట రూరల్ /కొమురవెల్లి, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సందర్భంగా జిల్లాలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, ధూల్మిట్ట మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
చేర్యాల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ లో 2 పోలింగ్ కేంద్రాలు, కొమురవెల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పోలింగ్ కేంద్రం, మద్దూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పోలింగ్ కేంద్రం, ధూల్మిట్ట జిల్లా పరిషత్ హై స్కూల్ ఒక పోలింగ్ కేంద్రం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.